పూసపాటిరేగ: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హైదరాబాద్‌లో యంగ్‌ఎన్‌వాయిస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ చిత్ర కళా ప్రదర్శనలో గోల్డ్ మెడల్ సాదించారు. ఈ ప్రదర్శనలో పూసపాటిరేగకు చెందిన 20 మంది విద్యార్థులు 30 చిత్రాలు పంపించగా వాటిలో నాలుగు చిత్రాలకు బంగారు పతకాలు వచ్చాయి. 10 చిత్రాలకు జ్యూరీ అవార్డులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సువాసన గల మొగ్గలు పేరుతో చిత్రాలు వేసిన ఎన్.జాహ్నవి, కె.వరలక్ష్మి, టి.చాందిని, నిహారిక, ఎస్.మధువెంకటరమణ బంగారు పతకాలు సాధించారు. జ్యూరీ అవార్డులు సాధించిన వారిలో పాఠశాలకు చెందిన సీహెచ్ ప్రణతి, ఎస్.సాయి సిద్ధార్థ, సీహెచ్ రమ్య, పి.చరిష్మా, ఎన్.ఝాన్సీ, డి. నిహారిక, ఎం.రాజేశ్వరి, ఎం.మోక్షశ్రీ, బి.అభిరామ్, ఎం.పావని ఉన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులను హెచ్‌ఎం సౌభాగ్యలక్ష్మి, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఐ.చినసత్యనారాయణ అభినందించారు.


