● పరారీలో ఉన్న ఆటో డ్రైవర్
గజపతినగరం: ఐరన్‌లోడుతో అతివేగంగా ఆటోడ్రైవర్ ప్రయాణిస్తూ ఓవ్యక్తి మృతికి కారకుడయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం మండలకేంద్రంలో జరిగింది. దీనిపై పోలీసులు తెలిపాన వివరాల ప్రకారం సెంటరింగ్ పనులకు గజపతినగరం నుంచి ఐరన్ లోడుతో పురిటి పెంట మామిడిబంద కాలనికి చెందిన గెద్దశ్రీనివాసరావు (46)అనేవ్యక్తి ఐరన్ లోడుతో ఆటోలో పయాణిస్తున్నాడు. అతివేగంతో ఆటోను నడపడంతో ఆటోపై కూర్చున్న గెద్ద శ్రీనివాసరావు కిందకు పడిపోగా ఆయన పైన ఐరన్ లోడు పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై స్పృహ తప్పాడు. దీంతో వెంటనే ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది ఈ క్రమంలో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివవరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడనిది శ్రీనివాసరావు కుటుంబం అని, మృతుడికి భార్య ముత్యమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబపెద్ద మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


