● నిండుకుండలా జలాశయం
● రెండు గేట్లు ఎత్తివేత..
పాచిపెంట: ఎడతెరపి లేని వర్షాలతో పెద్దగెడ్డ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 213.80 మీటర్లు కాగా, ప్రస్తుతం 212.50 మీటర్లకు చేరింది. జలాశయంలోకి 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లు ఎత్తి మూడువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జలాశయం జేఈ మోహన్ రావు తెలిపారు...


