పోస్టల్‌ ఓటింగ్‌ నిబంధనలు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ ఓటింగ్‌ నిబంధనలు గల్లంతు

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

పోస్టల్‌ ఓటింగ్‌ నిబంధనలు గల్లంతు

విజయనగరం అర్బన్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును ప్రశాంతంగా రహస్యంగా వినియోగించుకునేందుకు బుధవారం స్థానిక మున్సిపాల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో గందరగోళం నెలకొంది. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్‌ యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రొఫార్మా నింపే గది వద్ద క్యూలు సక్రమంగా లేకపోవడం, ఓటర్ల మధ్య తోపులాటకు ఆస్కారం కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పోటీ అభ్యర్థుల బంధువులైన కొందరు ఉద్యోగులు ఓటు వేసిన వెంటనే వెళ్లిపోకుండా క్యూలో ఉన్న ఇతర ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. పర్యవేక్షించాల్సిన సిబ్బంది, పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని పలువురు ఓటర్లు ఆరోపించారు.

మూడు అంతస్తుల్లో కేంద్రాలు..

అయినా తప్పని ఇబ్బందులు

నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో మూడు ఫెసిలిటేషన్‌ కేంద్రాలను వేర్వేరు అంతస్తుల్లో ఏర్పాటు చేసినప్పటికీ, ఓటింగ్‌కు ముందు అవసరమైన ప్రొఫార్మా నింపే గదిలో క్యూల నిర్వహణ సక్రమంగా లేపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కలెక్టర్‌ పరిశీలన..కమిషనర్‌ సమీక్ష

మరోవైపు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకుడు తేజ్‌ భరత్‌ కూడా ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. మున్సిపల్‌ కమిషనర్‌ బాలస్వామి కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement