వైఎస్సార్‌సీపీలో 20 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 20 కుటుంబాల చేరిక

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

వైఎస్సార్‌సీపీలో 20 కుటుంబాల చేరిక

దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపిలోకి 20 కటుంబాలు చేరినట్లు ఎంపీటీసీ అభ్యర్థి రౌతు రాజేశ్వరి బుధవారం తెలిపారు. రెండున్నరేళ్ల పాలనలో టీడీపీ ప్రజలకు చేసింది శూన్యమని గ్రహించి గ్రామానికి చెందిన వై. జోజి, కె.గురమ్మ, జి.సూర్యనారాయణ, కె.శ్రీను, జి హరీష్‌, దీలీప్‌, జి.మధు, జి.సతీష్‌ తదితరులు పార్టీలో చేరడంతో వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. జగన్నపై అభిమానంతో పార్టీలో చేరిన తాము ఎంపిటీసీగా రాజేశ్వరిని, జెడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడిని గెలిపిస్తామని పార్టీలో చేరిన వారు చెప్పారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన అలజంగి వాసులు

బొబ్బిలి: మండలంలోని అలజంగి గ్రామానికి చెందిన పది కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ మేరకు బుధవారం స్థానిక వైఎస్సార్‌ సీపీకార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి శంబంగి వేణుగోపాల నాయుడు పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా తాము వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నట్లు అలజంగి వాసులు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో ఎర్రాపు చిన్నారావు, అప్పారావు, మురళి, చంటి, మోహన్‌, తోట నాజర్‌, యమ్మల లక్ష్ము, బోనెల చిన్నారావు, యజ్జల చిట్టి, పెంకి బంగారాయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement