ఐదుగురి ప్రాణాలు కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ఐదుగురి ప్రాణాలు కాపాడిన పోలీసులు

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

విజయనగరం టౌన్‌: అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా విజయనగరం మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో జలయమమైన ఒక ఇంట్లో చిక్కుకున్న ఐదుగురి ప్రాణాలను విజయనగరం డీఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ బి.లక్ష్మణరావు, రూరల్‌ ఎస్సై వెలమల ప్రసాదరావు, పోలీస్‌ సిబ్బంది రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. రెండురోజులుగా అర్నబ్‌ తుఫాన్‌ వల్ల కురిసిన భారీ వర్షాలకు ధర్మపురి గ్రామంలో కొన్ని ఇళ్లు జలమయమయ్యాయి. ఒక ఇంట్లో ఐదుగురు చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో చిక్కుకున్న ఒక్కొక్కరినీ తాళ్లు, జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతానికి చేర్చారు. అనంతరం, లోతట్టు ప్రాంతంలో నీరు తగ్గేంత వరకూ ఎవరూ వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటుచేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, జలమయమైన ఇంట్లో చిక్కుకున్న ఐదుగురిని రక్షించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేసి, పోలీస్‌ అధికారులను, సిబ్బందిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement