మైక్రో అబ్జర్వర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మైక్రో అబ్జర్వర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విదార్థి మృతి చికిత్స పొందుతూ వ్యక్తి..

విజయనగరం అర్బన్‌: పురపాలక ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జనరల్‌ అబ్జర్వర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ పర్యవేక్షణలో బుధవారం మైక్రో అబ్జర్వర్లకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు కేంద్రాల లోపల, వెలుపల జరిగే పరిణామాలను నిరంతరం గమనిస్తూ, నిబంధనల ప్రకారం నమోదు చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణ, పోలింగ్‌ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధానాలు, సిబ్బంది బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్లు లేవనెత్తిన సందేహాలను జనరల్‌ అబ్జర్వర్‌ నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం టౌన్‌: సెంచురియన్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతున్న కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన యశస్విన్‌ భార్గవ్‌ (21) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి వన్‌టౌన్‌ ఎస్సై ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తన నలుగురు స్నేహితులతో కలిసి భార్గవ్‌ కేఎల్‌ పురంలో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఫ్రెండ్స్‌ అందరూ బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. గదిలోని సీలింగ్‌ కొక్కానికి ఉరి వేసుకున్నాడు. స్నేహితులు తిరిగి వచ్చేసరికి వేలాడుతూ కొనప్రాణంతో కనిపించిన భార్గవ్‌ను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ప్రాణాలు పోయాయని నిర్ధారించారు. మృతుడి తండ్రి చిత్ర రామజోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసన్నకుమార్‌ తెలిపారు.

సీతంపేట: మండలంలోని తలైబుగూడ గ్రామానికి చెందిన సవర అప్పన్న (58) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈనెల 12న సీతంపేటలో గిరిజనోత్పత్తుల విక్రయానికి తీసుకువచ్చిన సందర్భంగా వారపు సంత వద్ద రోడ్డుదాటుతుండగా పికప్‌వ్యాన్‌ అప్పన్నను ఢీ కొట్టింది. దీంతో గాయాలపాలు కాగా కొత్తూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య గయ్యారమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో వారంతా గుండెలవిసేలా రోదిస్తున్నారు.

చెట్టుపై నుంచి జారి పడి వ్యక్తి..

సీతంపేట: మండలంలోని పెద్దగూడ గ్రామానికి చెందిన సవర ఫల్గుణరావు (42) అనే వ్యక్తి బుధవారం చెట్టుపై నుంచి జారి పడి మృతిచెందాడు. మేకలు మేత వేయడానికి కావాల్సిన ఆకులను సేకరించేందుకు చెట్టుపైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య మీనాకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫల్గుణ మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఈ మృతిపై ఫిర్యాదు అందలేదని ఎస్సై వై అమ్మన్నరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement