వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు రెగ్యులేటర్‌ నుంచి నీరు విడుదల

మక్కువ: వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు సువర్ణముఖి, గోముఖి రెగ్యులేటర్‌ ద్వారా నదుల్లోకి బుధవారం నీటిని ఇరిగేషన్‌ అధికారులు విడిచిపెట్టారు.అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఒడిశా నుంచి సువర్ణముఖి, గోముఖి నదుల ద్వారా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో సుమారు 3వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వీఆర్‌ఎస్‌ ఫుల్‌ రిజర్వ్‌ లెవెల్‌ 161.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 159 మీటర్లకు నీరు చేరుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా గోముఖి రెగ్యులేటర్‌ ద్వారా వెయ్యి క్యూసెక్కులు, సువర్ణముఖి రెగ్యులేటర్‌ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని నదుల్లోకి విడిచిపెట్టారు. దీంతో గోముఖి, సువర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మక్కువ మండలంలోని కవిరిపల్లి గ్రామం వద్ద కాజ్‌వేపై నుంచి నీరు ప్రవహించడంతో సుమారు పది గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే గోముఖి నది సమీపంలో శివాలయం, అయ్యప్ప స్వామి దేవాలయాల వద్దకు నీటి తాకిడి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement