జలకలం..! | - | Sakshi
Sakshi News home page

జలకలం..!

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

జలకలం..!

● ఉప్పొంగిన నదులు

● పలు గ్రామాలకు నిలిచిపోయిన

రాకపోకలు

● స్తంభించిన జనజీవనం

సాలూరు:

అర్నబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు సాలూరు మండలంలోని గోముఖి, సువర్ణముఖి, వేగావతి తదితర నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. మామిడిపల్లిలో సువర్ణముఖి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో గ్రామశివారులో బ్రిడ్జి ప్రక్కన రోడ్డు మీదుగా నీరు ప్రవహించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక పీహెచ్‌సీకి వరద నీరు చేరడంతో తహసీల్దార్‌ సురేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తమై విలువైన సామగ్రి, మందులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత అనుభవాలున్నప్పటికీ, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పదే పదే హెచ్చరిస్తున్నా, ముంపునకు గురయ్యే వరకు పీహెచ్‌సీలో సామగ్రి, మందులను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడం కేవలం వైద్యాదికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తోణాం సమీపంలో గోముఖి నది ఉప్పొంగడంతో ఎగువమెండంగి, దిగువమెండంగి, శిఖపరువు, పూతికవలస గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దండిగాం వద్ద సువర్ణముఖి ఉప్పొంగడంతో కురుకుట్టి, డెన్సరాయి, సంపంగిపాడు తదితర పంచాయతీల్లో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వేగావతి, వట్టిగెడ్డ ఉప్పొంగడంతో పారన్నవలస పంచాయతీ పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం వల్ల మొక్కజొన్న, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. జీగిరాం సమీపంలో పంటలు నీట మునిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement