రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ మండిపడ్డారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెండ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. విజయనగరం మున్సి పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున శుక్రవారం నామినేషన్‌ వేసిన కోలగట్ల శ్రావణికి మద్దతు తెలియజేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్సీ సురేష్‌బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఏంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌ సహా పలు వాహనాలను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికలను సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత నడుమ ఓడిపోతారనే భయంతో ఎన్నికలకు ముందే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర బలగాల సమక్షంలో నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. రాష్ట్రంలోని పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డుకుంటే పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

అభ్యర్థులు లేక...

విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ తదితర మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు మేయర్‌, చైర్మన్‌, వార్డు మెంబర్లను ప్రకటించే పరిస్థితిలో కూటమి లేకపోవడం విచారకరమని, టీడీపీ వారినే జనసేనలోకి మార్పుచేసి పోటీచేయించే పరిస్థితి నెలకొందని బెల్లాన ఎద్దేవాచేశారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండా కూలీలుగానే మిగిపోయారే తప్ప ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. స్థాఽనిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌లో కూర్చున్నారంటే పరిస్థితి అర్ధమవుతుందన్నారు. ప్రస్థుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులను, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలోని పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంలో పార్లమెంట్‌ సభ్యులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు ప్రశ్నించారు. ఓటర్లను, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అదిపెద్ద కుట్రగా పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ దుష్టపరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారనే భయంతో దాడులకు తెగబడుతున్నారని వాపోయారు.

ఎంపీలకే

రక్షణ లేకుంటే

సామాన్యుల పరిస్థితి ఏంటి...?

అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు

పుంగనూరులో వైఎస్సార్‌సీపీ

శ్రేణులపై దాడి అప్రజాస్వామికం

ఓటమి భయంతో భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్రలు

కేంద్ర బలగాలతోనే సజావుగా స్థానిక సంస్థల ఎన్నికలు

మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement