కూటమి నేతల కిడ్నాప్ యత్నం
● అభ్యర్థుల వినూత్న ప్రచారం
● వాట్సాప్‌లో మేసేజ్‌లు... వాయిస్ రికార్డులు
● సమయం లేక డిజిటల్ వ్యూహాలు అమలు
● జెడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరింపు
● లేకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
విజయనగరం: మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారానికి పట్టుమని వారం రోజుల సమయం కూడా లేకపోవడం... పైగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అభ్యర్థులు సంప్రదాయ ప్రచారానికి సమాంతరంగా డిజిటల్ వ్యూహాలకు తెర లేపారు.
డివిజన్‌ల వారీగా గ్రూపులు సంక్షిప్త సందేశాలు
అభ్యర్థులు వాట్సప్‌ను తమ ప్రధాన అస్త్రంగా మలచుకుంటున్నారు. డివిజన్‌లోని ప్రతి ఓటరు ఫోన్ నంబరు సంపాదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వార్డుల వారీగా వాట్సప్ గ్రూపులు.. ప్రతి వీధికి, బ్లాక్‌కు ఒక్కో గ్రూప్ చొప్పున క్రియేట్ చేసి అభ్యర్థి ప్రొఫైల్, హామీలు, గతంలో చేసిన సేవలను వివరిస్తూ సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. చదవడం రాని ఓటర్లను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులే స్వయంగా మాట్లాడింది రికార్డ్ చేసి ఆడియో మెసేజ్‌లను నేరుగా ఓటర్ల వాట్సప్‌లకు పంపుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టా రీల్స్‌తో ‘జెన్–జీ’ ఓట్లకు గాలం
యువతను.. కొత్తగా ఓటు హక్కు పొందిన జెన్–జీ ఓటర్లను ఆకర్షించేందుకు డిజిటల్ క్యాంపెయిన్‌కు అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫేస్‌బుక్‌లో లైవ్ సెషన్లు పెడుతూ డివిజన్ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆకర్షణీయమైన రీల్స్, షార్ట్ వీడియోలతో హోరెత్తిస్తున్నారు. ట్రోల్ వీడియోలను వాట్సప్ స్టేటస్, సోషల్ మీడియా పేజీల ద్వారా వైరల్ చేస్తూ యూత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను చేరవేయడానికి కొందరు డిజిటల్ పాంప్లెట్లు వాడుతున్నారు.
కొత్తవలస: ఉత్తరాంధ్రలో కూటమి నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రత్యర్థి అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తవలస జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తుమ్మికాపల్లి మాజీ సర్పంచ్ విరోతి కొండలరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన నుంచి కొండలరావును కూటమి నేతలు బెదిరింపులకు గురి చేస్తూ వచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారులో కొండలరావు తుమ్మికాపల్లి బయలుదేరారు. ఆయన కదలికలపై నిఘా పెట్టిన కూటమి నాయకులు శుక్రవారం రాత్రి వడ్డిపేట సమీపంలో తమ కార్లు అడ్డంగా ఉంచి కొండలరావు కారును అడ్డుకున్నారు. దీంతో కారు లో నుంచి దిగిన కొండలరావును నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తూ వేరే కారులోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొండలరావు చాకచక్యంగా తప్పించుకొని వేరొక మార్గంలో తన ఇంటికి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని సీఐ విజయకుమార్, ఎస్పీకి ఫొన్‌లో వివరించారు. దీంతో ఎస్పీ దామోదర్ కొత్తవలస మండలంలో శనివారం పర్యటించి వివరాలు సేకరించారు.


