లాన్‌టెన్నిస్‌లో సత్తా చాటిన యశ్వంత్‌ | - | Sakshi
Sakshi News home page

లాన్‌టెన్నిస్‌లో సత్తా చాటిన యశ్వంత్‌

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

● జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

● అభినందించిన కుటుంబసభ్యులు, గ్రామస్తులు

తెర్లాం: మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన బొమ్మి యశ్వంత్‌ రాష్ట్రస్థాయి లాన్‌ టెన్నిస్‌ పోటీల్లో సత్తా చాటాడు. ఈనెల 10 నుంచి 12వరకు శ్రీకాళహస్తిలోని విక్రం టెన్నిస్‌ అకాడమీలో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ లాన్‌ టెన్నిస్‌ అండర్‌–17 విభాగంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న యశ్వంత్‌ అత్యంత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు. ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన 70వ ఏపీ స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో అండర్‌–17 విభాగంలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని సాధించాడు. ఈ పోటీల్లో బాగా రాణించడంతో జాతీయ స్థాయిలో జరగనున్న లాన్‌టెన్నిస్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున ఎంపికయ్యాడు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి మాజీ ఏఎంసీ చైర్మన్‌, కూనాయవలసకు చెందిన బొమ్మి శ్రీనివాసరావు కుమారుడు యశ్వంత్‌. లాన్‌టెన్నిస్‌లో యశ్వంత్‌ చూపిన ప్రతిభకు కుటుంబసభ్యులు, గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement