గర్జించిన భోగాపురం రైతులు | - | Sakshi
Sakshi News home page

గర్జించిన భోగాపురం రైతులు

Oct 13 2026 1:11 AM | Updated on Oct 13 2026 1:11 AM

విజయనగరం గంటస్తంభం: భోగాపురం ప్రాంతంలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌ వేదికగా రైతులు గర్జించారు. తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదంటూ సర్కారును హెచ్చరించారు. తొలుత 12 ఎకరాల భూమి అవసరమని చెప్పి, ఇప్పుడు 1,200 ఎకరాలు కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చి నష్టపోయామని, ఇప్పుడు మరోసారి భూములు కోల్పోతే తమ కుటుంబాల జీవనాధారం ఏమవుతుందని ప్రశ్నించారు. వ్యవసాయ భూములే తమకు జీవనాధారమని, వాటిని కోల్పోతే ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మహిళలు సహా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

20 నెలల మెస్‌ బిల్లులు చెల్లించాలి..

పెండింగ్‌ వేతనాలు, మెస్‌ బిల్లులు చెల్లించాలంటూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మోడల్‌ స్కూళ్లకు సంబంధించిన 20 నెలల బిల్లులు చెల్లించాలని, మెస్‌చార్జీ రూ.20, కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు కార్మికులను తొలగించే విధానాన్ని ఆపాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్రవంతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌ కోరారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పురం అప్పారావు, మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పెంకి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు, రాజీ, ధనలక్ష్మి, చిన్నారి, కుసుమ, తదితరులు పాల్గొన్నారు.

డేటా సెంటర్‌కు భూములు

లాక్కోవద్దంటూ ఆందోళన

కలెక్టరేట్‌ వద్ద ధర్నా

బకాయిలు చెల్లించాలని మధ్యాహ్న

భోజన కార్మికుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement