● మగ్గూరు వద్ద ఇసుక లారీలు అడ్డగింత
వంగర: ఇసుకను అక్రమంగా తరలిస్తే ఉపేక్షించేది లేదని మగ్గూరు గ్రామస్తులు హెచ్చరించారు. ఓనె అగ్రహారం సమీపంలోని నాగావళి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను మగ్గూరు వద్ద అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామం మీదుగా 20 రోజులు మాత్రమే ఇసుక తరలిస్తామని చెప్పారని, ఇప్పుడు మూడు నెలలుగా ఇసుకను తరలిస్తున్నారని, దీనివల్ల రోడ్లు, కాలువలు ధ్వంసమయ్యాయని, ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని మండిపడ్డారు. అనుమతులు లేకుండా ఇసుక తరలింపును అడ్డుకోవాలంటూ నినాదాలు చేశారు.
మక్కువ: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారు సోమవారం గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారిని అర్చకులు పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. శరన్నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా ఆలయంలో గణపతి హోమం నిర్వ హించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతి, ఆలయ ఈఓ వి.వి.సూర్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
భామిని: మండలంలోని బత్తిలిలో వెలసిన శ్రీ లలితాత్రిపుర సుందరీదేవికి సమర్పించేందుకు సోమవారం లక్ష పసుపుకొమ్ములను భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా సోమవారం తీసుకెళ్లారు. పసుపుకొమ్ముల అభిషేకానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


