● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
● పీజీఆర్‌ఎస్‌కు 218 వినతులు
రాజీపురానికి చెందిన దివ్యాంగ విద్యార్థి జి.దీపిక మోటరైజ్డ్ త్రిచక్ర వాహనం మంజూరు చేయాలని కోరగా, వినతిని పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విజయనగరం నగరంలోని కణపాక చెరువు పరిసరాల్లో దుర్వాసన, దోమల బెడద నివారణతో పాటు రాజీవ్‌నగర్‌లో కుక్కలు, పందులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. గుర్ల మండలం జమ్మిపేట పాఠశాల ఉపాధ్యాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి ఈ.మురళి, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి కృషి
విజయనగరం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు కృషిచేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదుదారుల నుంచి 36 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 14, కుటుంబ కలహాలకు సంబంధించి నాలుగు, మోసాలకు పాల్పడినట్లు ఎనిమిది, ఇతర అంశాలకు సంబంధించి పది ఫిర్యాదులు ఉన్నాయి. గ్రీవెన్స్‌సెల్‌లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు పనిదినాల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపించాలని అధికారులకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ.లీలారావు, ఎస్సైలు ప్రభావతి, పద్మావతి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి మొత్తం 218 వినతులు స్వీకరించారు. వాటిలో 106 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని, అర్హులైన ఫిర్యాదుదారులకు నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్యలు, డీ–పట్టా భూముల రీ–సర్వే, ఆన్‌లైన్ భూ రికార్డుల్లో పేర్లు నమోదు, ఎల్‌ఎస్ సమ్యసల పరిష్కారం కోరుతూ పలువురు వినతులు సమర్పించారు. వాటిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్న దత్తిరాజేరు మండలం, భూపాల


