● పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన మాజీ డిప్యూటీ సీఎం
జియ్యమ్మ వలస రూరల్: మండలంలోని డంగభద్ర పంచాయతీకి చెందిన సుమారు టీడీపీ 30 కుటుంబాల వారు ఆదివారం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు బెజ్జిపురపు మురళి ఆధ్వర్యంలో మాజీవైస్ సర్పంచ్ లింగురౌతు గోవిందరావు, రాగోలు గంగునాయుడు, గంట్యాడ గణపతి నాయుడు, వావిలపల్లి తాతబాబు, రమణ నాయుడు, తోట నవీన్, రాయల కుమార్,చందక భాస్కరరావు, కొండగొర్రి లక్ష్మణరావు, వూలక చంద్రశేఖర్‌తో పాటు 30 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి సచివాలయాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందించి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చి ఆదుకున్నారని, వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లు అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, నేడు అలాంటి పరిస్థితి లేదని పార్టీలో చేరిన వారంతా తెలిపారు. చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి అయినంత వరకు ప్రజలను నమ్మించి అమలు కాని హామీలను ఇచ్చి, నేడు అవి నెరవేర్చలేదని మాయ మాటలు నమ్మిన ప్రజలు మోసపోయారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని, మాట తప్పని మడమ తిప్పని నేత జగన్‌మోహన్ రెడ్డితోనే సుపరిపాలన సాధ్యమన్నారు. అంతకు మించి పుష్ప శ్రీవాణి, పరీక్షిత్‌రాజుల నాయకత్వంలో ఉండాలని ఆశిస్తూ రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. దీంతో వారందరికీ పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కోట రమేష్ నాయుడు, లోలుగు నారాయణరావు, ఎం.కిషోర్, వెంకటరమణ, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.


