వీరఘట్టం: మండలంలోని సీఎస్‌పీ రోడ్డు చిట్టపులివలస జంక్షన్ వద్ద, నడిమికెల్ల వద్ద శుక్రవారం రాత్రి జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. నడుకూరు గ్రామానికి చెందిన చిప్పాడ రామకృష్ణ పశువులను తోలుకుంటూ ఇంటికి వస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన అప్పన్న అనే వ్యక్తి బలంగా ఢీకొట్టడంతో రామకృష్ణ తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి.అలాగే అప్పన్న బైక్ ముందుబాగం నుజ్జునుజ్జయింది. నడిమికెల్ల వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొట్టడంతో నరేంద్ర అనే వ్యక్తి కుడికాలి రెండు వేళ్లు తెగిపోయాయి. మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.గాయపడిన ముగ్గురు వ్యక్తులు వీరఘట్టం పీహెచ్‌సీకి రావడంతో వారికి సిబ్బంది వైద్య చికిత్సలు అందజేశారు. రామకృష్ణ పరిస్థితి ఆందోళనగా ఉండడంతో పాలకొండ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే 108 వాహనానికి కాల్ చేసినా అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుడు రామకృష్ణను బంధువులు ఆటోలో పాలకొండ తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న అప్పన్నకు వీరఘట్టం పీహెచ్‌సీ సిబ్బంది వైద్య చికిత్స అందజేశారు.


