● ఉత్సాహంగా పాల్గొన్న 70 మంది విద్యార్థులు
● విజేతలకు బెల్లులు, సర్టిఫికెట్ల ప్రదానం
విజయనగరం: విజయనగరంలోని మదర్ థెరిసా క్లబ్‌లో తైక్వాండో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 70 మంది విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బెల్ట్ టెస్ట్‌లో వివిధ విభాగాల వారీగా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇందులో ఎల్లో బెల్ట్ విభాగంలో 30 మంది, ఎల్లో–1 విభాగంలో 9 మంది, గ్రీన్–1 విభాగంలో 10 మంది, బ్లూ–1 విభాగంలో 5 మంది, రెడ్–1 విభాగంలో 16 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురాన అయ్యలు, అవనాపు విజయ్, న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి.వేణుగోపాల్‌రావు హాజరయ్యారు. బెల్ట్ టెస్ట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బెల్ట్‌లు, ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) అందజేసి, వారిని అభినందించారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.


