జాతీయ స్థాయి పారా స్విమ్మింగ్‌ పోటీలకు సత్యనారాయణ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పారా స్విమ్మింగ్‌ పోటీలకు సత్యనారాయణ

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

విజయనగరం: వచ్చే నవంబర్‌ 12 నుంచి 15 వరకు జరగబోయే పారా (దివ్యాంగుల) జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన పారా స్విమ్మర్‌ జాగారణ సత్యనారాయణ ఎంపికై నట్లు పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కె. దయానంద్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్‌ పోటీలలో సత్యనారాయణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు పతకాలు సాధించాడని పేర్కొన్నారు. పారాలింపిక్‌ కమిటీ నిబంధనల ప్రకారం కనీస అర్హత సమయం నమోదు చేయడంతో సత్యనారాయణ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడని వివరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు అభినందనలు తెలిపిన దయానంద్‌, రాబోయే జాతీయ స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి జిల్లాకు మరిన్ని పతకాలు, మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement