కరాటే పోటీల్లో 22 పతకాలు | - | Sakshi
Sakshi News home page

కరాటే పోటీల్లో 22 పతకాలు

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

కరాటే పోటీల్లో 22 పతకాలు

విజయనగరం అర్బన్‌: సత్య డిగ్రీ, పీజీ కళాశాల గ్రౌండ్స్‌లో శిక్షణ పొందుతున్న వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 22 పతకాలు సాధించారు. అక్టోబర్‌ 4న కొత్తవలస సమీపంలోని తుమ్మికపల్లె గ్రామం వీరభద్రపురంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ కల్యాణ వేదికలో నిర్వహించిన ఇన్విటేషన్‌ నేషనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026 (ఛాంపియన్స్‌ కప్‌ 3.0)లో 5 బంగారు, 6 వెండి, 11 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. ఒకినావా స్పోర్ట్స్‌ కరాటే–డో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కుమిటే, కాటా విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కోచ్‌లు సంతోష్‌, అసిస్టెంట్‌ కోచ్‌ సుధీర్‌, పిభార్గవ్‌లను కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీ సాయిదేవమణి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement