విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు ఆర్.వాణిశ్రీ, బి.శ్రీనివాస్ ఆకాంక్షించారు. అండర్–14,17 టెన్నిస్ క్రీడాంశంలో పాల్గొనబోయే బాలబాలికలకు 10,11,12 తేదీలోల తెనాలిలో జరగనున్న పోటీల్లో ప్రాతినిధ్యం వహించనుండగా..అండర్–14,17,19 వయస్సుల విభాగంలో హ్యాండ్‌బాల్ బాల,బాలికల జట్లు శ్రీకాళహస్తిలో జరగనున్న పోటీలకు పయనమయ్యాయి. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభ కనబరిచి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


