11నుంచి పోలమాంబ ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు | - | Sakshi
Sakshi News home page

11నుంచి పోలమాంబ ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు

Oct 10 2026 12:34 AM | Updated on Oct 10 2026 12:34 AM

మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల11వ తేదీ నుంచి 20వరకు శరన్నవరాత్రి మహోత్సవా(దసరా ఉత్సవాలు)లు జరపనున్నట్లు ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు పోలమాంబ అమ్మవారి చదురుగుడిలో శుక్రవారం ఆలయ కమిటీ చైర్మన్‌ నైదాన చిన్నతిరుపతి, కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల తేదీలను, జరపనున్న పూజలను కరపత్రం ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది మురళీకృష్ణ మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

గోడ కూలి వ్యక్తి మృతి

విజయనగరం టౌన్‌: స్థానిక రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫామ్‌ నంబర్‌ ఐదులో కూలి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తాగునీటి పైపు గోడ కూలి ఒక్కసారిగా పడిపోవడంతో ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. దీనికి సంబంధించి జీఆర్‌పీ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రోజు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న గుర్ల మండలం గూడెం గ్రామానికి బూర్లె నారాయణప్పడు (40) రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న పనులకు కూలీకి వచ్చాడు. ఐదో నంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై తాగునీటి పైపు పక్కన పనులు చేస్తుండగా తాగునీటి పైపు గోడ కూలి నారాయణప్పడు పైన పడిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సూర్యకాంతంతో పాటూ బాబు, పాప ఉన్నారు. జీఆర్‌పీ హెచ్‌సీ రవి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement