ఉద్యోగాల్లో శఠగోపం
● బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ.. ● జిల్లాలో బీసీలకు పదవులెక్కడ? ● ఎన్నికల వేళే గుర్తుకొస్తారా.. ● జనాభాలో సగానికిపైగా.. రాజకీయ ప్రాతినిధ్యంలో మాత్రం అన్యాయమా..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బీసీలు అంటే నచ్చదు. ఎన్నికల్లో బీసీల ఓట్లు కోసం ఉత్తుత్తి హామీలు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు ఎసరుపెడుతుంటారు. ఇదంతా ప్రతి ఎన్నికలో టీడీపీ అనుసరిస్తున్న విధానం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులతో పాటు అన్ని రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడున్న కూటమి ఎన్నికలు ముందు ఇచ్చిన హమీలు నిలబెట్టుకోలేకపోయింది. కోర్టులో బీసీల రిజర్వేషన్లు పెంపును దక్కించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా వదిలేసింది.
– రాగోలు రమేష్‌నాయుడు, బీసీ సంఘనాయకుడు,
గోవిందపురం, సంతకవిటి మండలం
విజయనగరం అర్బన్/రాజాం/దత్తిరాజేరు:
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ సీఎం చంద్రబాబు డ్రామాలకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టుగా మారింది. బీసీలపై కపటప్రేమ కోర్టు సాక్షిగా బట్టబయలైంది. రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామంటూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ జారీ చేసిన జీఓలు తీరా.. న్యాయస్థానంలో నిలవకపోవ డం ప్రభుత్వం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా రాజకీయాల్లో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయాలు నిలువవని తెలిసీ న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తుంటే ... బీసీలకు నిజంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా? లేక ఎన్నికల వేళ వారి మద్దతు పొందేందుకే రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందా? అన్న ప్రశ్నలు బీసీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రతిపక్ష వర్గాలు, బీసీ సంఘాల్లోని కొందరు నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర య్యే అవకాశాలను ముందుగానే పరిశీలించి, వాటిని అధిగమించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నిస్తున్నా రు. బీసీలకు మేలు చేయాలన్న లక్ష్యం నిజమైతే, కోర్టులో నిలిచేలా అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయాల్సిందని అభిప్రా యపడుతున్నారు. బీసీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు, జనాభా, స్థానిక సంస్థల్లో ప్రాతనిధ్యం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర డెడికేటెడ్ కమిషన్ నివేదిక గత ఆగస్టులోనే సమర్పించినప్పటికీ దాని వివరాలు, సిఫార్సులు ప్రజలకు పూర్తి స్థాయి లో అందుబాటులో లేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. రిజర్వేషన్ల పేరుతో హామీలు ఇచ్చి, చివరకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురైతే బీసీలకు ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న బీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం పేరుతో జీఓలు జారీ చేసి, ఆ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు ఎదురైతే నష్టపోయేది బీసీ వర్గాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
65 శాతం మంది బీసీలే ఉన్నా...
జిల్లాలోని 27 మండలాల్లో దాదాపు 65 శాతం వరకు జనాభా బీసీ వర్గాలకు చెందిన వారే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలంటే రాష్ట్రస్థాయిలో రిజ
కూటమి ప్రభుత్వం బీసీలపట్ల మెతకవైఖరి అనుసరిస్తోంది. లక్షల్లో ఉద్యోగాలు తీస్తామని చెప్పి హామీని నిలబెట్టుకోలేకపోయింది. గత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాలతో పాటు వలంటీర్లు నియామకంలో, ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం 25 శాతం (బీసీ–ఈతో కలిపి 29 శాతం) కూడా దాటని పరిస్థితి ఉంది. అటు స్థానిక సంస్థల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం, ఇటు ఉద్యోగాల్లో సైతం బీసీలకు న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెంపదెబ్బకొట్టింది. జరగని హామీని ఎన్నికల్లో పెట్టి బీసీలను చంద్రబాబునాయుడు మభ్యపెట్టారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి, బీసీలు పట్ల ప్రేమ, అభిమానం చాటుకోవాలి.
– మరిశర్ల గంగారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, వంగర
ర్వేషన్ శాతం ప్రకటించడంతో సరిపోదని, స్థానిక సంస్థల వారీగా జనాభా, ప్రాతినిధ్యం, చట్టపరమైన నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. డెడికేటెడ్ కమిషన్‌లో జిల్లాకు సంబంధించి ఏ వివరాలు పొందుపరిచారు? వివిధ బీసీ కులాల సామాజిక పరిస్థితులను ఎలా అంచనా వేశారు? స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంతమేర ప్రాతినిధ్యం కల్పించాలన్న అంశంపై ఏ సిఫార్సులు చేశారు? వంటి వివరాలు వెల్లడిస్తేనే జిల్లాలో బీసీలు దక్కే రాజకీయవాటాపై స్పష్టత వస్తుంది. అయితే కూటమి ప్రభుత్వ ఆదిశగా అవగాహన కలిగించే పని చేయలేదని విమర్శిస్తున్నారు.


