మోసపూరిత కూటమిని మట్టికరిపిద్దాం | - | Sakshi
Sakshi News home page

మోసపూరిత కూటమిని మట్టికరిపిద్దాం

Oct 10 2026 12:34 AM | Updated on Oct 10 2026 12:34 AM

మోసపూరిత కూటమిని మట్టికరిపిద్దాం ● శాసన మమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కార్యకర్తలే పార్టీకి బలం: బెల్లాన

చంద్రబాబుది వెన్నుపోటు పాలన: శంబంగి

పాలనలో సూపర్‌ ఫ్ల్లాప్‌: సందీప్‌

● శాసన మమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ

బాడంగి: ప్రజలకు ఉచిత హామీలిచ్చి మోసం చేసిన కూటమిని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మట్టి కరిపిద్దామని మాజీ మంత్రి, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బాడంగిలోని స్వామి కల్యాణ మండపం వద్ద పార్టీ మండలాధ్యక్షుడు యామల శివప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అరాచక పాలన సాగుతోందన్నారు. రైతులు కరువుతో అలమటిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు మండిపొతున్నాయని, పచ్చడికి శనగపప్పు కుడా కొనుక్కోలేని స్థితిలో ప్రజలు బాధపడుతున్నా పాలకులకు పట్టడంలేదన్నారు. అధికారం కట్టబెట్టిన ప్రజలను కూటమి నేతలు చిన్నచూపు చూస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో 50 ఏళ్లకే పింఛన్‌, నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ అందకపోవడంతో ఇప్పుడు వడ్డీలు భరించలేక సంఘాల నుంచి తప్పుకుంటున్నారన్నారు. రైతులకు ఎరువులు, పంట నష్టపరిహారం వంటివి అందే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. దాచుకోవడం, దోచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదని విమర్శించారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ మోసం చేసేందుకు ప్రయత్నించి కోర్టులో భంగపడ్డారన్నారు.

కార్యకర్తలే వైఎస్సార్‌సీపీ బలమని, బాడంగి మండలంలో సుమారు 9 వేల మంది క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయా

నికి సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, కరువు కవలలుగా వస్తాయని, రైతులు, అన్నివర్గాల ప్రజలను అవస్థలకు గురిచేస్తాయని విమర్శించారు.

రాష్ట్రంలో వెన్నుపోటునాయకుడు ఎవరని కార్యకర్తలను బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రశ్నించగా తడుముకోకుండా చంద్రబాబు అని సమాధానమివ్వడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లుమోగాయి. మామతో పాటు నమ్మిన ప్రజలకు వెన్నుపొడిచిన నాయకుడు చంద్రబాబని విమర్శించారు. బొబ్బిలిలో బినామీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

సూపర్‌ సిక్స్‌ అంటూ హామీలిచ్చి అమలుచేయడంలో చంద్రబాబు ఫ్లాప్‌ అయ్యారని బొత్స తనయుడు, యువ నాయకుడు బొత్స సందీప్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దామన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుందామన్నారు. సమావేశంలో పలువురు కార్యకర్తలకు పార్టీ ఐడీకార్డులను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, పార్టీ వైద్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బొత్సకాశి నాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దాన సత్యనారాయణ, బొబ్బిలి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.వెంకట మురళీకృష్ణ, బొబ్బిలిమండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోధరరావు, జిల్లా కమిటీ సభ్యుడు ఆవు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పెద్దింటి రామారావు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బేతనపల్లి శంకరరావు, మాజీ ఎంపీపీ భోగి గౌరి, మండలంలోని తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement