దసరాకు 100 ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

దసరాకు 100 ప్రత్యేక బస్సులు

Oct 10 2026 12:34 AM | Updated on Oct 10 2026 12:34 AM

దసరాకు 100 ప్రత్యేక బస్సులు ● జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి ఆడ పిల్లల పట్ల వివక్ష చూపొద్దు ● డీఎంహెచ్‌ఓ జీవనరాణి బాలుడి తొడలో దూరిన కర్రముక్క ● మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలింపు

విజయనగరం క్రైమ్‌: దసరా సందర్భంగా విజయనగరం కాంప్లెక్స్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడు పుతున్నట్టు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి శుక్రవారం తెలిపారు. విశాఖపట్నం, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్‌.కోట రూట్‌లలో 100 సర్వీసులు నడుపుతామన్నారు. ఆదివా రం అదనంగా 10 స్పెషల్స్‌ బస్సులు, సోమ వారం 15 స్పెషల్స్‌ బస్సులు వేస్తామని చెప్పా రు. దూర ప్రాంత సర్వీసులను కూడా పెంచామని, ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజయనగరం ఫోర్ట్‌: ఆడపిల్లల పట్ల వివక్ష చూపకూడదని డీఎంహెచ్‌ఓ జీవనరాణి అన్నా రు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను సమభావంతో చూడాలన్నారు. ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నా రు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎన్‌.సూర్యనారాయణ, డాక్టర్‌ దీప్‌ చంద్‌, తదితరు లు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: ఆడుకుందామని ఉత్సాహంగా చెట్టెక్కిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖర్జ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెంది న మండంగి సుమన్‌ కుమారుడు వరుణ్‌ తేజ్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో ఆడుకునేందుకు ఇంటి ఆవరణ లోని పూలచెట్టు ఎక్కాడు. అదుపుతప్పి బాలు డు కిందకు జారి పడిపోయాడు. ఈ క్రమంలో కింద ఉన్న ఓ కర్ర ముక్క బాలుడి ఎడమ కాలి తొడ భాగంలోకి బలంగా గుచ్చుకుంది. తొడ కింద నుంచి పైకిరావడంతో కుటుంబ సభ్యు లు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలుడికి ప్రాథమిక చికిత్స అందించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, కర్రముక్క కాలిలో ప్రమాదకరంగా ఇరుక్కుపోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement