విజయనగరం టౌన్: గంజాయి నియంత్రణ, రహ దారి భద్రత చర్యల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో మెగా వాహన తనిఖీలు చేపట్టారు. గంజా యి కిట్స్‌తో చేపట్టిన తనిఖీల్లో గంజాయి సేవించిన ఏడుగురు వ్యక్తులను గుర్తించినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు డీ అడిక్షన్ సెంటర్స్‌కు చికిత్స కోసం పంపిస్తామన్నారు. వాహనదారులకు హెల్మె ట్, ఇన్సూరెన్స్, లైసెన్స్ లేని వాహనదారులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రైల్వేస్టేషన్, లంకాపట్నం, పూల్‌బాగ్ కాలనీలో వంద గంజాయి కిట్స్‌తో గంజాయి వినియోగించే వారిని గుర్తించిన ట్టు ఎస్పీ తెలిపారు. వాహన తనిఖీల్లో విజయనగరం, చీపురుపల్లి డీఎస్పీలు ఎస్.లక్ష్మణమూర్తి, ఎస్.రాఘవులు, వన్‌టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, ఎస్ బీ సీఐ ఎ.వి.లీలారావు, రాజాం సీఐ నవీన్‌కుమార్, ఈగల్ టీమ్ ఎస్ఐ స్వీటీ, ఎస్ఐలు రవికుమార్, నవీన్‌పడాల్, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.


