విజయనగరం అర్బన్: జిల్లాలోని 27 మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందిలో వైద్య పరమైన కారణాలతో ప్రాధాన్య తా కేటగిరీ ప్రయోజనం పొందుతున్న వారు తమ వైద్య అర్హతలను ధ్రువీకరించుకోవాలని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో విజయనగ రం జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేస్తారని పేర్కొన్నా రు. ఏపీ స్థానిక కేడర్ ఏర్పా టు, ప్రత్యక్ష నియామకాల నియంత్రణ ఉత్తర్వులు–2025 ప్రకారం ఈ ప్రక్రి య చేపడుతున్నట్లు వివరించారు. నిర్దేశించిన గడువులోగా వైద్య పరీక్షలు చేయించుకుని కొత్త ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు.


