ఉల్లి పంపిణీ ఉత్తిదేనా..? | - | Sakshi
Sakshi News home page

ఉల్లి పంపిణీ ఉత్తిదేనా..?

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

ఉల్లిపాయలు సరఫరా కాలేదు..

జిల్లాలోని ఏడు రైతు బజార్లకు రాయితీ ఉల్లి ఇంకా సరఫరా కాలేదు. 3, 4 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. బియ్యం కూడా మిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంది.

– బి.రవికిరణ్‌, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ

విజయనగరం ఫోర్ట్‌:

ప్రజలకు ఊరడించేలా ప్రకటనలు చేయడం.. నమ్మించడం.. తర్వాత మోసం చేయడం చంద్రబాబు సర్కారుకు రివాజుగా మారింది. చెప్పేదానికి చేసేదానికి అస్సలు పొంతన ఉండదు. దీనికి రైతు బజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు లేకపోవడమే నిదర్శనం. బయట మార్కెట్‌లో ఉల్లిపాయలు కిలో రూ.55 నుంచి రూ.60 మధ్య పలుకుతోంది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ధరలు కట్టడి చేయాలంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వీరి దృష్టి మరల్చేలా రైతు బజార్లలో రాయితీపై కిలో రూ.35కే ఉల్లి పాయలు అందిస్తామని 20 రోజుల కిందట చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంతవరకు ఎక్కడా ఒక్క కిలోకూడా సరఫరా చేసింది లేదు. ప్రభుత్వం రాయితీ ఉల్లిపాయలు సరఫరా చేస్తామని ప్రకటించడంతో చాలా మంది రైతు బజార్లకు ఉల్లిపాయలు కోసం వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

బియ్యం కౌంటర్లూ ఎత్తేశారు...

బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రైతు బజార్లలో రాయితీపై బియ్యం అందిస్తామని చంద్రబాబు సర్కారు ప్రత్యేక బియ్యం కౌంటర్లు తెరిచింది. అవి కూడా వారం రోజులుగా మూత పడ్డాయి. రాయితీ బియ్యం కోసం వచ్చిన వినియోగదారులు వెనుదిరుగుతున్నారు. స్డీమ్‌ బియ్యం (బీపీటీ) కిలో మార్కెట్‌లో రూ.62 ఉంది. వాటిని రూ.52కు, రా బియ్యం (బీపీటీ) రూ.58 ఉండగా రూ.50కు విక్రయిస్తున్నట్టు చేసిన ప్రకటనలు ఫ్లెక్సీలకే పరిమితమయ్యాయంటూ వినియోగదారులు వాపోతున్నారు.

రైతు బజార్లలో రాయితీపై ఉల్లి సరఫరా చేస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కార్‌

మార్కెట్‌ కిలో ఉల్లి రూ.60

రైతు బజార్లలో రాయితీపై రూ.35కే ఇస్తామని ప్రకటన

బియ్యం కౌంటర్లు ఎత్తేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement