ఘనంగా వైమానిక దళ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వైమానిక దళ దినోత్సవం

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

విజయనగరం రూరల్‌: కోరుకొండ సైనిక పాఠశాలలో దేశ వైమానిక దళ 94వ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సైనిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, గ్రూప్‌ కెప్టెన్‌ ఎస్‌.ఎస్‌.శాస్త్రి మాట్లాడుతూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వైమానిక యోధుల ధైర్యసాహసాలు, శౌర్యం, అంకితభావాన్ని వివరించారు. వైమానిక దళ ఘన చరిత్ర, సాంకేతిక పురోగతి, అమరుల త్యాగాలను స్మరించారు. భారత వైమానిక దళం ప్రతిబింబించే క్రమశిక్షణ, ధైర్యం, సేవాభావాన్ని విద్యార్థులు తమ జీవితాల్లో అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌, వింగ్‌ కమాండర్‌ వి.కిరణ్‌, క్యాడెట్లు, డే స్కాలర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్‌గా రొంగలి జగన్నాథం

బొబ్బిలి: వైఎస్సార్‌సీపీ బొబ్బిలి పరిశీలకుడు రొంగలి జగన్నాథంను వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా పార్టీ అధిష్టానం నియమించినట్టు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేయడం ఆనందంగా ఉందని రొంగలి జగన్నాథం సాక్షికి తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషిచేస్తానన్నారు.

వంగర ఎంఈఓపై యూటీఎఫ్‌ నాయకుల ఫిర్యాదు

వంగర: మండల విద్యాశాఖాధికారి–1 యు.గణేష్‌నాయుడుపై ఆ మండలానికి చెందిన యూటీఎఫ్‌ నాయకులు ఎంపీడీఓ తులా రాజారావుకు ఫిర్యాదు చేశారు. జీతాల చెల్లింపులో తప్పులను సరిచేయాలని ఏడాదికాలంగా కోరుతున్నా ఎంఈఓ స్పందించడంలేదని ఆరోపించారు. తప్పులు సరిచేయాలని అడిగితే అసభ్య పదజాలంతో ఉపాధ్యాయులను తిడు తూ కించపరుస్తున్నారని వాపోయారు. ఎంఈఓ తీరుపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు చేసినవారిలో యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ నారాయణరావు, పి.గౌరీశంకరరావు, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు బలగ ప్రసాద్‌, నాయకులు పి.మురళీ, కె.రమణ, శ్రీను, భాస్కర్‌, తిరుపతి, వెంకటేష్‌, కృష్ణారావు, కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement