● ఆందోళన కొనసాగించిన కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు
● నలుపు రిబ్లన్లు ధరించి ప్రభుత్వం తీరుపై నిరసన
విజయనగరం ఫోర్ట్: న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుండా ఆందోళన చేస్తున్నవారికి చంద్రబాబు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేయడంపై కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వం తీరుపై నలుపురిబ్బన్లు ధరించి సర్వజన ఆస్పత్రి వద్ద గురువారం నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 400 మంది ఉద్యోగుల సమ్మెతో ఆస్పత్రుల్లో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
సమ్మె ఉద్ధృతం చేస్తాం
సమ్మెను రోజురోజుకు ఉద్ధృతం చేస్తాం. షోకాజ్ నోటీస్‌లు ఇచ్చినా సమ్మె ఆగదు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి.
– ఎస్.స్వాతి, జేఏసీ చైర్మన్
సమ్మె కొనసాగిస్తాం
కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ కో కన్వీనర్ అయిన నాకు, జేఏసీ చైర్మన్‌కు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీటికి భయపడే ప్రసక్తే లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం కొనసాగిస్తాం.
– ఆర్.శ్రీనివాసరావు, ఏపీమెడికల్,
హెల్త్ ఉద్యోగుల సంఘం జేఏసీ కో కన్వీనర్


