అప్పులు తీర్చేందుకు బిడ్డను అమ్మేసిన తల్లి | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చేందుకు బిడ్డను అమ్మేసిన తల్లి

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

● భర్త ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

విజయనగరం ఫోర్ట్‌: అప్పులు తీర్చేందుకు ఓ తల్లి సొంత బిడ్డను అమ్మేసిన ఘటన విజయనగరం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం పట్టణానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గతనెలలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక బిడ్డను వేరొకరికి రూ.3.50 లక్షలకు విక్రయించింది. కుటుంబ కలహాలతో రెండు నెలలుగా భార్యకు దూరంగా నివసిస్తున్న భర్త పుట్టిన బిడ్డను ఏం చేశావని ప్రశ్నించడంతో చనిపోయాడని పొంతనలేని సమాధానం చెప్పింది. అనుమానం వచ్చిన భర్త ఈనెల 5వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. దీనిపై పూర్తి విచారణ చేయాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. భర్త ఆదరణ లేకపోవడం, డ్వాక్రా అప్పు తీర్చేందుకు వేరే దారిలేక శిశువును వేరొకరికి విక్రయించినట్టు అధికారుల వద్ద తల్లి వాపోయింది. ఇది చట్టరీత్యా నేరమని చెబుతూ శిశువును బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. పట్టణంలోని శిశుగృహకు గురువారం తరలించి సంరక్షిస్తున్నారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారులు బి.రామకోటి, యాళ్ల నాగరాజు, శిశు గృహ మేనేజర్‌ త్రివేణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement