రాష్ట్రస్థాయి పోటీలకు కంటోన్మెంట్‌ హై స్కూల్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు కంటోన్మెంట్‌ హై స్కూల్‌ విద్యార్థులు

Oct 9 2026 2:14 AM | Updated on Oct 9 2026 2:14 AM

చికెన్‌

చికెన్‌

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లలోకి విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కంటోన్మెంట్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్హత సాధించారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ క్రీడలో ఆర్‌.సుదర్శన్‌ కుమార్‌, అండర్‌–14 ఫుట్‌బాల్‌ జట్టులో ఎం. రాహుల్‌, అండర్‌–17 క్రికెట్‌ జట్టులో ఒ.షణ్ముకేశ్వర ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.కాంచన తెలిపారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్‌, గోపాల్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement