25 మద్యం దుకాణాలకు 138 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

25 మద్యం దుకాణాలకు 138 దరఖాస్తులు

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

విజయనగరం రూరల్‌: జిల్లాలోని ఏ–4 మద్యం దుకాణాల పునరుద్ధరణ (రెన్యువల్‌) ప్రక్రియలో భాగంగా మిగిలిన 30 మద్యం దుకాణాలకు గడువు ముగిసేనాటికి 25 మద్యం దుకాణాలకు 138 దరఖాస్తులు అందాయని ఎకై ్సజ్‌ అధికారి బి.శ్రీనాథుడు బుధవారం తెలిపారు. జిల్లాలోని 169 మద్యం దుకాణాల రైన్యువల్‌కు 139 మద్యం దుకాణాలు రెన్యువల్‌ కాగా 30 మద్యం దుకాణాలు రెన్యువల్‌ కాకుండా మిగిలిపోయాయి. వీటిని లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈనెల 6న దరఖాస్తు గడువు ముగిసే నాటికి 138 దరఖాస్తులు అందాయి. వీటివల్ల ప్రభుత్వానికి మొత్తం రూ.4,14,00,000ల ఆదాయం సమకూరింది. 25 ఏ4 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8న ఉదయం 8 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలోని ఆడిటోరియంలో కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని తెఎకై ్సజ్‌ అధికారి లిపారు.

జిల్లా బూత్‌ కమిటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా పొన్నాడ

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా బూత్‌ కమిటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని అర్తమూరు గ్రామానికి చెందిన పొన్నాడ కుమార్‌ నియామకమయ్యారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్వర్వులు వెలువరించింది.

రాములోరికి పట్టుపవిత్రాల సమర్పణ

● మంగళవాయిద్యాలతో పట్టుపవిత్రాల ఊరేగింపు

● పాల్గొన్న భక్తజనం

● నేడు స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి పట్టు పవిత్రాల సమర్పణ కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. వేకువ జామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం మంగళాశాసనం, తీర్థ గోష్ఠి కార్యక్రమాలను పూర్తిచేశారు. పారాయణాలు, జపములు, హవనాలు నిర్వహించి అష్ట కలశస్నపన మహోత్సవం జరిపించారు. అనంతరం దేవస్థాన అర్చకులు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద రుత్విక్కుల ఆధ్వర్యంలో శ్రీరంగం నుంచి తీసుకువచ్చిన పట్టు పవిత్రాలను మంగళవాయిద్యాల నడుమ దేవస్థాన వెలుపుల ఊరేగింపు జరిపించి సీతారామస్వామికి సమర్పించారు. పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, శాంతి కల్యాణంతో పాటు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపిస్తామని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్‌, వర ప్రసాద్‌, రామగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement