50 | - | Sakshi
Sakshi News home page

50

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

ఉపాధిహామీ వేతన బకాయిలు
కోట్లు!
రూ.

విజయనగరం ఫోర్ట్‌: ఉపాధి హామీ పధకం పేరు వీబీజీరామ్‌జీగా మారిందే తప్ప వేతనదారులకు తిప్పలు తప్పడం లేదు. పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినా నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం ఆవేదనకు, ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది. వీబీజీరామ్‌జీ పథకం కింద పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంది. అయితే, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందంటూ వేతనదారులు వాపోతున్నారు. వాస్తవంగా వీబీజీరామ్‌జీ పథకంలో పనికి వెళ్లిన వారంతా పేదవారే. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కుటుంబ పోషణ కోసం పనికి వెళ్తే వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు జిల్లాలోని 22 మండలాల్లో కరువు అలుముకుంది. 10 మండలాల్లో తీవ్ర కరువు ఉండగా 12 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పంట భూములు సాగుకు నోచుకోక, గ్రామాల్లో పనులు దొరకక వేతనదారులకు కష్టాలు తప్పడంలేదు. ఈ పరిస్థితుల్లో కూడా పనికి వెళ్లిన వారికి వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో వీబీజీ రామ్‌జీ పథకం జాబ్‌ కార్డులు 3.34 లక్షలు ఉన్నాయి. ఇందులో వేతనదారులు 5.34 లక్షల మంది ఉన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో చేసిన పనులకు సంబంధించి వేతనదారులకు రూ.50 కోట్ల మేర బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

వేతనబకాయిల అంశాన్ని డ్వామా పీడీ ఎస్‌.శారదాదేవి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా బకాయిల మాట వాస్తవమేనని, నిధులు విడుదలైతే వేతనదారుల ఖాతాలకే జమవుతాయని చెప్పారు.

ఆర్థిక

ఇబ్బందుల్లో

వేతనదారులు

వేతనాల

చెల్లింపుల్లో టీడీపీ సర్కారు జాప్యంపై

ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement