భోగాపురంలో డేటా సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలి. ఇప్పటికే భోగాపురంలో వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. మరలా ఇదే గ్రామంలో అభివృద్ధి పేరిట ప్రైవేటు వ్యక్తులకు విలువైన భూములు దారాదత్తం చేయడం దుర్మార్గం. భూ సేకరణ నిర్ణయం వెనుకకు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
– దేవ పుష్పలత, మాజీ ఎంపీపీ, భోగాపురం
ఆత్మహత్యలే శరణ్యం
నిరుపేద రైతుల నుంచి భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం. జీవనాధారం కోల్పోతే వేరే గత్యంతరం లేదు. ఉన్నపాటి కొద్దిపాటి భూములను ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దారుణం. చంద్రబాబు ప్రభుత్వం నిరుపేద రైతుల పొట్ట కొట్టి ప్రైవేటు వ్యక్తులకు భూములు ఇచ్చేందుకు చూస్తోంది.
– ఎస్.పుష్ప, మహిళా రైతు, భోగాపురం
భూసేకరణ ఆపాలి
డేటా సెంటర్ కోసం ప్రభుత్వ భూ సేకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఎయిర్ పోర్టు పేరిట ఇప్పటికే గ్రామానికి చెందిన 900 ఎకరాలు తీసుకోగా, మరలా డేటా సెంటర్ కోసం 350 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయం సరికాదు.
– పి.భానుప్రకాష్, భోగాపురం రైతు


