చీపురుపల్లిరూరల్(గరివిడి): కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో అప్పులే తప్ప అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు... అప్పుచేసిన రూ.4 లక్షల కోట్లు ఏం చేశారంటూ వైఎస్సార్‌సీపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం పాలన తీరుపై ధ్వజమెత్తారు. గరివిడి మండలం గెడ్డపువలస గ్రామంలో బుధవారం టీడీపీకి చెందిన 20 కుటుంబాలు స్థానిక నాయకుడు కొణిస కల్యాణ్, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ నాయకులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సున్నావడ్డీ రుణాలు లేవని, పింఛన్లు అందడం లేదని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారని, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదని, అప్పుచేసిన రూ.4లక్షల కోట్లు ఏం చేశారని శాసనమండలిలో ప్రశ్నిస్తే సమాధానం కరువైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని, అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
● పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ బొత్స సత్యన్నారాయణ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారని, ఆయన హాయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నాడు–నేడు పనులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్‌వెల్‌నెస్ కేంద్రాలు, జగనన్నకాలనీలు ఇలా.. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు జరిగాయని, కూటమి ప్రభుత్వంలో ఏమిచేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తు మళ్లీ ప్రజల వద్దకు సంక్షేమ పాలన వస్తుందన్నారు.
● భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష, బొత్స సందీప్ మాట్లాడుతూ రెండున్నరేళ్లు ఓపిక పడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందని, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారన్నారు. ప్రజలకు మంచి జరుగుతందన్నారు. గెడ్డపువలసలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన ఎడ్ల పైడినాయుడు, ఈశ్వరరావు, ఎడ్ల అప్పలనాయు డు, ఎడ్ల కృష్ణ, ఎడ్ల శంకరరావు, మీసాల గోవింద్, మీసాల సన్యాసిరావు, రెల్లి రామారావు తదితరులకు పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు ఎడ్ల అప్పారావు, జి.శ్రీరాములనాయుడు, కడుమల రాంబాబు, గుడివాడ తమ్మినాయడుపాల్గొన్నారు.
శాసనమండలి విపక్షనేత బొత్స
సత్యనారాయణ
వైఎస్సార్‌సీపీలో చేరిన గెడ్డపువలస, బుదరాయవలస, ఇప్పలవలస, నరసయ్యపేట గ్రామస్తులు


