బీసీలకు చంద్రబాబు నమ్మక ద్రోహం | - | Sakshi
Sakshi News home page

బీసీలకు చంద్రబాబు నమ్మక ద్రోహం

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

విజయనగరం: మోసం. అబద్ధం.. నమ్మించి వంచించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు దానిని అమలు చేయకపోవడం దారుణమన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయ డం సిగ్గుచేటన్నారు. విజయనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు చంద్రబాబు కల్పిస్తామన్న 34 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం మొట్టికాయలు పెట్టిన తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 28లోగా బీసీలకు కల్పించే రిజర్వేషన్‌లపై చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తారా? లేదా? అన్నది తెలియజేయాలని సూటిగా ప్రశ్నించడం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టుగా వాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇరకాటంలో పడిందన్నారు. రిజర్వేషన్‌ అంశం రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమని, లేని పక్షంలో ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలు సేకరించి, వాటి ఆధారంగా బీసీ జనాభా, వెనుకబాటు తనాన్ని లెక్కించే సర్వే నిర్వహించి కేంద్రానికి నివేదించిన తరువాత అమలు సాధ్యమవుతుందన్నారు. ఇవేమీ చేయని చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వెనుకంజ వేస్తున్న అంశాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

12న తాజా మాజీ ప్రజాప్రతినిధులకు సన్మానం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో స్థానిక సంస్థలైన కార్పొరేషన్‌, మున్సిపాలీటీలు, నగర పంచాయతీలు, ఎంపీపీ తదితర ప్రజాప్రతినిధులను పార్టీ తరఫున ఈ నెల 12న సన్మానిస్తామని బెల్లాన చంద్రశేఖర్‌ వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు అంబళ్ల శ్రీరాములనాయుడు, పీరుబండి జైహింద్‌కుమార్‌, డోల మన్మథకుమార్‌, పతివాడ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

34 శాతం రిజర్వేషన్ల కల్పనపై

మభ్యపెట్టే ప్రయత్నం

ఎన్నికలకు ముందు హమీ ఇచ్చి నేడు మోసం చేస్తున్న వైనం

హైకోర్టు విధించిన డైడ్‌లైన్‌ కాదని... సుప్రీంకోర్టుకు వెళ్లడంలో ఆంతర్యమేమిటి..?

ఈ నెల 12న తాజా మాజీలకు సన్మానం

మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement