రేపటి నుంచి బ్యాంకుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి బ్యాంకుల సమ్మె

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

విజయనగరం అర్బన్‌: బ్యాంక్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్‌ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరంలోని అమర్‌భవన్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించి, సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకంలో (పీఎల్‌ఐ) ఉద్యోగులు, అధికారులకు న్యాయం చేయడం, ఇతర పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్‌ మురళీశ్రీనివాస్‌, కోఆర్డినేషన్‌ కమిటీ అధ్యక్షుడు బీవీ ప్రసాద్‌, ఎస్‌బీఐ జోనల్‌ కార్యదర్శి రమేష్‌, వివిధ బ్యాంకుల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement