పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

విజయనగరం రూరల్‌:

గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా, తొలి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో విజయనగరం జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బొబ్బిలి డివిజన్‌లో బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం మండలాలు ఉన్నాయి. విజయనగరం డివిజన్‌లో కొత్తవలస, లక్కవరపుకోట, శృంగవరపుకోట, వేపాడ మండలాలు తొలి విడతలో చేరాయి. ఆయా పంచాయతీల్లో నమోదైన ఓటర్లు వార్డు సభ్యులను, సర్పంచులను ఎన్నుకుంటారు.

8 మండలాల్లో తొలివిడత

పంచాయతీ పోరు

26న పోలింగ్‌, అదేరోజు

ఓట్ల లెక్కింపు

15 నుంచి నామినేషన్ల స్వీకరణ

జిల్లా ఎన్నికల అధికారి,

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement