చంద్రబాబు టక్కుటమారా విద్యలు విజయనగరంలో చెల్లవు. బొత్స అంటే ఒక బ్రాండ్. ఎంతోమంది సమస్యలను పరిష్కరించే నాయకుడికి ఇబ్బందిపెట్టాలనుకోవడం అవివేకం. బొత్స సత్యానారయణ నాయకత్వంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ చెక్కు చెదరదు. 23 మంది ఎమ్మెల్యేలను 2014–19 మధ్య చంద్రబాబు దొడ్డిదారిన చేర్చుకున్నా భయపడలేదు. పార్టీ జిల్లాస్థాయి సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావడం జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న నమ్మకానికి అద్దంపడుతోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, ఎంపీపీ, ఎంపీటీసీ, వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం. ఇంటింటికీ వెళ్లి వెన్నుపోటు టీడీపీ నిజస్వరూపాన్ని చెబుదాం.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, వైఎస్సాసీపీ రీజనల్ కో ఆర్డినేటర్


