అంతర్‌ జిల్లా సాఫ్ట్‌ బాల్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా సాఫ్ట్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

అంతర్‌ జిల్లా సాఫ్ట్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

బొబ్బిలి రూరల్‌: 13వ సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌ బాల్‌ పోటీలు శుక్రవారం పారాది జెడ్పీహెచ్‌ స్కూల్‌లో ప్రారంభమయ్యాయి.రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఈ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక పటుత్వం లభిస్తుందని,రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. విద్యార్ధి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కనబర్చాలని, చదువుతో పాటు క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలని తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేబినాయన, డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎస్పీ గోవిందరావు ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement