● కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు
విజయనగరం గంటస్తంభం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సదస్సులో పాల్గొని సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్యం, నైపుణ్యాభివృద్ధిపై సీఎం సమీక్షించారు. సంక్షేమ పథకాల తేదీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించి ప్రజలకు తెలియాజేయాలని ఆదేశించారు. 22ఏ జాబితాలోని భూ సమస్యలను పరిష్కరించడంతో ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాల భూములకు విముక్తి కల్పించామని సూచించారు. రీసర్వే పూర్తయిన భూములకు బ్లాక్‌చెయిన్ సాంకేతికతతో భద్రత కల్పించాలని సూచించారు. నవంబర్ 1 నుంచి రియల్‌టైమ్ ఇంటిగ్రేషన్ చేపట్టాలని, 45 రోజుల్లో బ్యాక్‌లాగ్ భూ వివరాలను బ్లాక్‌చెయిన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాలని, నియోజకవర్గాల వారీగా జాబ్‌ఫెయిర్లు నిర్వహించాలని సూచించారు. 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించేలా చర్యలు చేపట్టాలని, పాఠశాల భవనాల భద్రతపై ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు.


