చక్కెర కర్మాగారాన్ని మూసివేయొద్దు | - | Sakshi
Sakshi News home page

చక్కెర కర్మాగారాన్ని మూసివేయొద్దు

Sep 11 2026 8:22 AM | Updated on Sep 11 2026 8:22 AM

మూసివేత ప్రకటనను యాజమాన్యం ఉపసంహరించుకోవాలి

రేగిడి: ఎల్‌నినో ప్రభావంతో 2027–28 క్రషింగ్‌ సీజన్‌కు రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం మూసివేస్తున్నామని యాజమాన్యం చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి చక్కెర పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు చక్కెర కర్మాగారం జీఎం వెంకట సూర్యనారాయణకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తొలుత నిర్వహించిన సమావేశంలో రైతు సంఘ నాయకుడు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం గతంలో మాదిరిగా రైతులకు రాయితీలు ఇచ్చి చెరకు సాగు విస్తీర్ణానికి తగు ప్రణాళికలతో ముందుకు వస్తే రైతులంతా యాజమాన్యానికి సహకరిస్తారని అన్నారు. యాజమాన్యం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంత వరకు దశలవారీగా ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కింజరాపు సురేష్‌, చింత సంగంనాయుడు, కెంబూరు కోటేశ్వరరావు, కుమరాపు బలరాంనాయుడు, కర్రి రమణ, మజ్జి అప్పలనాయుడు, నీలకంఠేశ్వర యాదవ్‌, కొప్పర వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement