సామాజిక సేవలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిది | - | Sakshi
Sakshi News home page

సామాజిక సేవలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిది

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

మాజీ డిప్యూటీ స్పీకర్‌

కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం: సామాజిక సేవలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిదని మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం జిల్లా ఆర్యవైశ్య సంఘం 2026–28 సంవత్సరాలకు సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయనగరంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కష్టపడి సంపాదించిన ధనంలో కొంతభాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించడం అభినందనీయమన్నారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులకు వెన్నుదన్నుగా ఉంటూ పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్ముయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం కృషిచేస్తుందన్నారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజని మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళలకు ఆర్థిక చేయూత, స్వయం ఉపాధి కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తామన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడు బండారు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు త్వరలోనే స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌తో పాటు ప్రధాన కార్యదర్శిగా రవ్వా వెంకటేష్‌, కోశాధికారిగా గుడిశా బాలకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రవ్వా మంజు, ప్రధాన కార్యదర్శిగా కొల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారిగా గుంపిన ఇందిర, యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా తమ్మన కల్యాణరాజు, ప్రధాన కార్యదర్శిగా కేదారిశెట్టి లక్ష్మణమూర్తి, కోశాధికారిగా దేవరపల్లి కిరణ్‌ కుమార్‌, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత పూర్వ అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు పర్యవేక్షణలో వాసవీమాత చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాటూరి రంగనాథ్‌, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కండె నాగరాజేష్‌, వ్యాపారవేత్త అంబికా కృష్ణ, వైశ్య సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుసుమంచి సుబ్బారావు, ఆలవెల్లి శేఖర్‌, కుమ్మరిగుంట శ్రీనివాసరావు, ఈశ్వరరావు, డిమ్స్‌ రాజు, మడిపల్లి రామారావు, గుడిశా శివకుమార్‌, శ్రీనివాసరావు, తవ్వా మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement