కొండంపేటలో సినిమా షూటింగ్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

కొండంపేటలో సినిమా షూటింగ్‌ సందడి

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

రాజాం: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేట శివాలయం వద్ద సోమవారం సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. బీవీజీ –2 బ్యానర్‌పై ప్రేమంటే తెలుసా.. ఓ మనసా టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకులు వర్థన్‌ తెలిపారు. రాజాం పట్టణ సీఐ డి.నవీన్‌, తృప్తి రిసార్ట్‌ ఎం.డి పీవీజీ కృష్ణ (మురళీ మాస్టారు) క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోగా గణేష్‌, హీరోయిన్‌గా భాగ్య, విలన్‌గా వంగర మండలానికి చెందిన సీనియర్‌ నటుడు పెంకి బాలకృష్ణ నటిస్తున్నారు. కార్యక్రమంలో కెమెరామెన్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement