న్యూస్‌రీల్
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు
సంపాదన మూరెడు..ఖర్చు బారెడు
జేబులకు పడుతున్న చిల్లు
ఏం కొనాలి..ఏం తినాలి అంటూ ఆందోళన
బియ్యం బస్తా రూ.1700
కిలో రూ.75కు చేరిన పంచదార
సన్‌ఫ్లవర్ నూనె ధర రూ.192
కందిప్పు రూ.175
నిత్యావసరాల కొనుగోలుకు
బెదిరిపోతున్న సామాన్యులు
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
వంటింట్లో ధరల మంట..!
రెండు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. –8లో
విజయనగరం గంటస్తంభం:
మార్కెట్‌లో నిత్యావసరాల ధరల భగభగలతో సామాన్యుడి బతుకు బండి గతి తప్పుతోంది. ఒక్కసారిగా పెరిగిన ఉల్లిపాయలు, పంచదార, బియ్యం ధరలు చాలవన్నట్లు కూరగాయలు కూడా అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి.
పేదలకు చుక్కలు చూపిస్తున్న బియ్యం ధర
ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు రూ.1,300 పలికిన 25 కిలోల బస్తా ఇప్పుడు రూ.1700 దాటిపోయింది. నెలకు రెండు బస్తాలు అవసరమయ్యే నాలుగైదు మంది ఉన్న కుటుంబానికి కేవలం బియ్యం కోసమే అదనంగా రూ.800పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్క బియ్యం, నూనెలే కాదు.. కందిపప్పు, పంచదార, బెల్లం ధరలు సైతం పరుగులు పెడుతున్నాయి. పిల్లలకు పాలు, పండ్లు, చిరుతిళ్లు పెట్టడం సంగతి దేవుడెరుగు.. కనీసం మూడు పూటలా తిండి దొరకడమే గగనమైపోయిందని గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కన్నీరుమున్నీరవుతున్నారు.
నడ్డి విరిచిన ధరలు
గత రెండేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం సన్‌ఫ్లవర్ నూనైపె కిలోకు ఏకంగా రూ.72కు పైగా బాదారు. స్థానిక కిరాణా కొట్లలో పెరిగిన ధరల తీరు చూస్తే సామాన్యుడికి బతకాలన్న ఆశే చచ్చిపోతోంది.
కూరగాయల సెగ
మార్కెట్‌లో ప్రస్తుతం టమాటో కిలో రూ.50 పలుకుతుండగా మిగిలిన ఏ కూరగాయలైనా కిలో రూ. 40 నుంచి మొదలవుతున్నాయి. వంటల్లో ఎంతో కీలకమైన అల్లం, పచ్చిమిర్చి ధరలు కూడా ఆకాశాన్నంటుతుండడంతో ఏమీ కొనలేని..ఏమీ తినలేని దుస్థితిలో నలిగిపోతున్నారు.


