విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందు కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ ఆడిటోరి యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరి గే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేయవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల కు సంబంధించిన సమస్యలపై పీజీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్
పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజ లు తమ అభిప్రాయాల ను కూడా తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు.


