ఇండియన్‌ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

ఇండియన్‌ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం

రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులో గల ఇండియన్‌ బ్యాంక్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా బ్యాంక్‌ నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌, లాకర్ల గది వైపు మంటలు వెళ్లకుండా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన పత్రాలు కాలి బూడిద కాగా.. లాకర్లు భద్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్‌ ఇన్‌చార్జి ఎస్సై వై.గోవిందరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement