గజపతినగరం రూరల్ (జామి): దేశానికి ఉజ్వల భవిష్యత్ యువతతోనే సాధ్యమవుతుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. యువత బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. జామి మండలం అన్నంరాజుపేట గ్రామంలో ఆదివారం రాత్రి చేపట్టిన ‘పల్లెనిద్ర‘ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ దురలవాట్లకు దూరమయ్యేలా చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గ్రామ సందర్శనలు, పల్లెనిద్ర, సంకల్పం వంటి కార్యక్రమాల ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతున్నారని తెలిపారు. మహిళలు, చిన్నారుల పట్ల గౌరవంగా నడుచుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దన్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హిమగిరి, సబ్ ఇన్‌స్పెక్టర్ వీరజనార్ధన్ పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


