–8లో
పెళ్లయిన వారం రోజులకే వరుడు మృతి
కోటి కలలతో, బంధుమిత్రుల సందడి మధ్య నూతన జీవితంలోకి అడుగు పెట్టిన వారం రోజుల్లోనే.. వరుడు మృతి చెందాడు.
విజయనగరం ఫోర్ట్:
ఎల్‌నినో ప్రభావం జిల్లా రైతాంగంపై తీవ్ర స్థాయిలో పడింది. ఎల్‌నినో కారణంగా ఇంతటి ఘోర పరిస్థితి ఉంటుందని రైతులు కూడా ఉహించి ఉండరు. ఆలస్యం అయినా వర్షాలు పడతాయని రైతులు ఇన్నాళ్లు భావించారు. కాని వాన జాడ కరువవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం మాట దేవుడెరుగు.. తిండి గింజలు కూడా కరువవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన అర్ధ శతాబ్ద కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంటల సాగుకు వేలాది రుపాయిలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు పంటలు పూర్తిగా ఎండిపోవడంతో తమ పరిస్థితి ఏంటో తెలియడం లేదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
● రైతు కుదేలు..
ఇప్పటి వరకు సాగు చేసిన పంటలు, ముఖ్యంగా వరి పంటకు రైతులు వేలాది రుపాయిలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఆ పంటలు నీరు లేక ఎండిపోవడంతో పెట్టుబడి కూడా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఎకరం వరి పంట సాగుకు వరి విత్తనాలకు, దమ్ము, నారు తీయడానికి, నాట్లు వేయడానికి, ఎరువులకు ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.9 వేలు ఖర్చు పెట్టారు. మూడు ఎకరాలు ఉన్న వారు అయితే రూ.24 నుంచి రూ. 27 వేలు వరకు ఖర్చు చేశారు. ఐదెకరాలు ఉన్న వారు రూ.40 వేల నుంచి రూ.45 వేలు వరకు ఖర్చు చేశారు. ఎలినినో ప్రభావంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
● 69,879 హెక్టార్లకే పరిమితం..
జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 69,879 హెక్టార్లు మాత్రమే సాగైంది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 11, 318 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 8799 హెక్టార్లలో సాగైంది. చోడి పంట 43 హెక్టార్లకు 26 హెక్టార్లు సాగైంది. వేరుశనగ 284 హెక్టార్లకు 89 హెక్టార్లు, నువ్వులు 5252 హెక్టార్లకుగాను 2667 హెక్టార్లు, పత్తి 2204 హెక్టార్లకుగాను 2291 హెక్టార్లు, గోగు 254 హెక్టార్లకుగాను 121 హెక్టార్లు, చెరుకు 3813 హెక్టార్లకుగాను 1721 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి.
వర్షపాతం (మి.మీ.)
170.8
123.5
137.5
187.9
96.3
58.1
జూలై
జూన్
ఆగస్టు
పశుగ్రాసానికి కొరతే..
పంటలు ఎండిపోతుండడంతో పశుగ్రాసానికి కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వరి నూర్పులు తర్వాత వచ్చే వట్టి గడ్డి దొరకని పరిస్థితి. పశుగ్రాసం సాగు చేయడానికి కూడా బోర్లు ఉన్న చోట తప్ప మిగతా చోట్ల వీలు కాని పరిస్థితి. ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి.
ఎండిపోతున్న నారుమడులు
ప్రస్తుత ఖరీఫ్‌లో సమయం మించి పోతుందని భావించిన రైతులు చెరువులు, గుంతల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజిన్లు ద్వారా తోడి వరి పంట సాగుకు పూనుకున్నారు. అదేవిధంగా నారుమడులను బతికించుకున్నారు. ప్రస్తుతం చెరువులు, గుంతల్లో కూడా నీరు లేకపోవడంతో నారుమడులు ఎండిపోతున్నా బతికించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో నారుమడులు, నాట్లు వేసిన మడులు కళ్లముందే ఎండిపోతున్నా ఏమి చేయలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టుడుతున్నారు.
వర్షాభావంతో
ఎండుతున్న
పంటలు
వేలాది రుపాయిలు పెట్టుబడులు పెట్టిన రైతులు
నీరు లేక
ఎండిపోతున్న నారుమడులు
పశుగ్రాసం కొరత కూడా తప్పేలా లేదు..
అన్నదాత
ఆందోళన


